‘దేవర’ లో దసరా నటుడు

ఎన్టీఆర్ – కొరటాల శివ కలయికలో ఎన్టీఆర్ 30 వ మూవీ దేవర తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా విడుదలైన ఫస్ట్ లుక్ అభిమానుల్లో అంచనాలు రెట్టింపు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా..ఈ చిత్రం తాలూకా విశేషాలు బయటకు వస్తూ ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తాజాగా ఈ మూవీ లో దసరా ఫేమ్ షైన్ టామ్ చాకో నటిస్తున్నట్లు సమాచారం. దసరా మెయిన్ విలన్ గా యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన..ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ లో ఛాన్స్ రావడం తో ఆయన మరింత బిజీ కావడం ఖాయం గా కనిపిస్తుంది.

అలాగే ఈ మూవీ లో హీరోయిన్ జాన్వీ పాత్ర కు సంబంధించి కూడా అనేక విషయాలు తెలుస్తున్నాయి. ఈ సినిమాలో హీరోయిన్ జాన్వీ కపూర్ ఒక మత్స్యకారుని కూతురుగా కనిపించనుందట. సినిమాలో ఎక్కువ శాతం లంగా ఓణి మరియు పల్చటి చీర కట్టులో కనిపించబోతుందట. లంగా ఓణి మరియు చీర కట్టు లో చూపించాల్సినంత అందాలను జాన్వీ కపూర్ చూపించబోతున్నట్లుగా ఇప్పటికే విడుదల అయిన ఆమె పోస్టర్ ను చూస్తే అర్థం అవుతుంది.