పండగపూట ఉసూరుమనిపించిన ప్రభాస్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాధేశ్యామ్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేసిన ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో ‘సలార్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభించారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలతో పాటు బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్ దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ పాన్ ఇండియా మూవీలో కూడా ప్రభాస్ నటిస్తున్నాడు.

ఈ సినిమాను ఎప్పుడో అనౌన్స్ చేసినా, ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో ఈ సినిమా ఎంతవరకు వచ్చిందని ప్రేక్షకులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఇటీవల ఈ సినిమా షూటింగ్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించారు. కాగా బుధవారం శ్రీరామనవమి పండుగ కావడంతో ఆదిపురుష్ చిత్రం నుండి ఏదైనా అప్‌డేట్ వస్తుందని అందరూ అనుకున్నారు. రామాయణం ఆధారంగా ఈ సినిమా రానుండటంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేస్తారని అందరూ వెయిట్ చేశారు. చిత్ర యూనిట్ కూడా బుధవారం ఉదయం 7.11 గంటలకు ‘ఆదిపురుష్’కు సంబంధించి అప్‌డేట్ ఉండబోతున్నట్లు ప్రకటించింది.

కానీ, పండగపూట ఆదిపురుష్ చిత్ర యూనిట్ ప్రేక్షకులను ఉసూరుమనిపించారు. ఆదిపురుష్ చిత్రం నుండి ఎలాంటి అప్‌డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేయలేదు. దీంతో ఈ సినిమా నుండి మరో అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ‘పండగ పూట ఇలా హర్ట్ చేయడం ఏమిటి డార్లింగ్?’ అని ప్రభాస్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.