ట్రంప్‌ రాక.. కాశ్మీరీ యువతుల డాన్స్‌

కాశ్మీరీ సంస్కృతి, సంప్రదాయాల్నిప్రతిబింబించేలా అమ్మాయిలు డాన్సులు

kashmir-ladies-trump
kashmir-ladies-trump

అహ్మదాబాద్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుటుంబసమేతంగా మరి కాసేపట్లో భారత్‌కు రానున్నారు. ఈనేపథ్యంలో అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన ఫ్యామిలీకి ఘన స్వాగతం పలికేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లూ చేసింది. ఎయిర్‌పోర్ట్ నుంచీ ట్రంప్ రోడ్ షోలో మోతేరా క్రికెట్ స్టేడియంకి వెళ్తారు కాబట్టి మార్గ మధ్యలో 22 కిలోమీటర్లలో ఆయనకు స్వాగతం పలికేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లూ చేసింది. అందులో భాగంగా కాశ్మీరీ యువతులతో డాన్స్ చేయించబోతోంది. కాగా ట్రంప్ కోసం ఉదయమే వచ్చిన యువతులు ట్రంప్ విమానం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఆ రోడ్‌ షోలో డాన్స్‌ వేయాల్సిన వారికి ప్రత్యేకంగా ఐడీ కార్డులు ఇస్తున్నారు. కాశ్మీరీ సంస్కృతి, సంప్రదాయాల్ని ప్రతిబింబించేలా ఈ అమ్మాయిలు డాన్సులు చెయ్యబోతున్నారు.ట్రంప్ రాకను దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలూ అలర్ట్‌గా ఉన్నాయి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/