కేసీఆర్ డెడ్ లైన్ ఫై ఈటెల సెటైర్లు

వరి కొనుగోలు విషయంలో ఢిల్లీ సాక్షి గా ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రానికి 24 గంటల డెడ్ లైన్ విధించారు. 24 గంటలలోపు ధాన్యం సేకరణపై నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. దీనిపై నిర్ణయం తీసుకోకపోతే… రైతు ఉద్యమంతో.. భూకంపం సృష్టిస్తామని కేసీఆర్ హెచ్చరించారు. కేసీఆర్ ఇచ్చిన డెడ్ లైన్ ఫై హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సెటైర్లు వేశారు. 24 గంటల్లో వరి కొనుగోలు విషయంలో కేంద్రం తన వైఖరి చెప్పకపోతే భూకంపం సృష్టిస్తా అంటున్నారని…. అంతపెద్ద మాట అక్కర్లేదని.. తెలంగాణ వచ్చి 20 లక్షల్లో పండించి వడ్లను రూ. 5 వేల కోట్లు ఖర్చుపెట్టి ధాన్యాన్ని కొనుగోలు చేసి కేంద్రానికి బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ వచ్చిన మొదట్లో రూ.3000లతో కేంద్రం కొనుగోలు చేసిందని…. 2020-21లో రూ. 26,000 కోట్లతో రైతుల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసిందని ఈటెల అన్నారు. ఉప్పుడు బియ్యం ఇవ్వమని… తెల్ల బియ్యం ఇస్తామని లేఖ ఇచ్చింది నిజం కాదా….? అని ప్రశ్నించారు. భూకంపం సృష్టించే నీవు మెడ మీద కత్తి పెడితే ఉత్తరం ఇస్తావా.. అని ఎద్దేవా చేశారు. రైతుల గోస కేంద్ర ప్రభుత్వానికి, మోదీకి కాదని… కేసీఆర్ కే రైతుల గోస తగులుతుందని ఈటెల అన్నారు.