క్షీణించిన షర్మిల ఆరోగ్యం.. అపోలో ఆస్పత్రికి తరలింపు

YSRTP అధినేత్రి వైస్ షర్మిల చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను రెండో రోజు పోలీసులు భగ్నం చేశారు. అర్థరాత్రి ఒంటి గంట సమయంలో అరెస్ట్ చేసి ఆమె దీక్షను భగ్నం చేసి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం షర్మిలకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

హాస్పటల్ కు తరలించే ముందే దీక్ష స్థలి వద్ద ముగ్గురు వైద్యులు షర్మిల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. రాత్రి ఒంటి గంట సమయంలో వైద్యుల సూచన మేరకు షర్మిలను పోలీసులు హాస్పిటల్ కి తరలించారు. షర్మిల ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమెను దీక్షా శిబిరం నుండి ఆస్పత్రికి తరలించారని తెలుస్తోంది. తాను చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లోటస్ పాండ్ లో షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు.. తమ కూతురు షర్మిలను చూసేందుకు వైఎస్ విజయమ్మ జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రికి వెళ్లారు. హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి షర్మిల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.