హైవేలపై ఇక నిరంతరం గస్తీ
శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు పెట్రోలింగ్ కోసం 4 పోలీస్ వాహనాలు

హైదరాబాద్: దిశ ఘటన తర్వాత హైవేలపై భద్రత ప్రశ్నార్థకంగా మారిన వేళ తెలంగాణ పోలీసులు దానిపై చర్యలు చేపట్టారు. హైవేలపై నిరంతరం నిఘా కొనసాగించేలా పెట్రోలింగ్ వాహనాలను ప్రవేశపెట్టారు. శంషాబాద్ నుంచి షాద్‌నగర్ వరకు పెట్రోలింగ్ కోసం 4 పోలీస్ వాహనాలను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..నాలుగు పెట్రోలింగ్ వాహనాలతో శంషాబాద్ నుంచి షాద్‌నగర్ మార్గంలో 24 గంటల గస్తీ ఉంటుందని తెలిపారు. ఇంకా హైవేపై ప్రమాదాలు జరిగితే, తక్షణం స్పందించేందుకు ఇవి తోడ్పడతాయని సీపీ వెల్లడించారు. క్షతగాత్రులను త్వరగా చికిత్స కోసం ఆస్పత్రికి తరలించేందుకు ఉపయోగపడతాయని అన్నారు. హైవే పెట్రోలింగ్ నిర్వహించే గస్తీ బృందాలకు కార్పోరేట్ ఆస్పత్రిలో శిక్షణ ఇచ్చినట్లు సీపీ తెలిపారు. హైవేపై ప్రమాదాలు ఆరికట్టే ఉద్దేశంతోనే ఈ వాహనాలు ప్రవేశపెట్టినట్లు సీపీ సజ్జనార్ చెప్పారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/