మరికాసేపట్లో పెళ్లి అనగా..పెళ్లి కూతురు ఆత్మహత్య

Suicide that the corona got positive
suicide

మరికాసేపట్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన యువతీ…ఆత్మహత్య చేసుకున్న ఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. నవీపేటకు చెందిన రవళి, నిజామాబాద్‌కు చెందిన సంతోష్‌తో వివాహం ఫిక్స్ అయ్యింది. ఈరోజు ఆదివారం ఉదయం 10 గంటలకు వీరికి వివాహం జరుగనుంది. ఇంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది. ఇంట్లోకి వెళ్లిన రవిళ.. తిరిగి బయటకు రాలేదు. ఎంతకీ డోర్ ఓపెన్ చేయకపోయేసరికి కుటుంబ సభ్యులు డోర్ పగలగొట్టి చూడగా.. ఉరికొయ్యకు వేళాడుతూ విగతజీవిగా కనిపించింది.

అందరినీ కన్నీట ముంచింది. అయితే, కాబోయే భర్త వేధింపులే రవళి ఆత్మహత్యకు కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లికి ముందే ఉద్యోగం చేయాలని, పలు రకాల ఒత్తిళ్లకు గురిచేయడంతో ఆత్మహత్య చేసుకుందని రవళి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రవళి ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇటు బంధువుల ఆరోపణలు, రవళి ఫోన్ కాల్ డేటా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారిస్తున్నారు.