‘విరూపాక్ష’ సక్సెస్ పట్ల మెగా హీరోస్ రియాక్షన్ ..

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ – సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ వర్మ దండు డైరెక్షన్లో వచ్చిన విరూపాక్ష మూవీ సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఆక్సిడెంట్ తర్వాత చాల గ్యాప్ తీసుకొని తేజ్ చేసిన సినిమా కావడం , టీజర్ , ట్రైలర్ ఆసక్తి గా ఉండడం , సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం తో సినిమా ఫై అంచనాలు పెరిగాయి. ఆ అంచలనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండడం తో ప్రేక్షకులు బ్రహ్మ రధం పడుతున్నారు.

ఇక సినిమా సక్సెస్ కావడం తో మెగా హీరోస్ తేజ్ కు విషెష్ అందిస్తున్నారు. ఇప్పటికే మేన మామ పవన్ కళ్యాణ్ తేజ్ కు ప్రత్యేక బుకే అందజేయగా..సాయితేజ్ కి ట్విట్టర్ ద్వారా చరణ్ అభినందనలు తెలియజేశాడు. ‘‘తమ్ముడు సాయిధరమ్ తేజ్‌కి అభినంద‌న‌లు. ‘విరూపాక్ష’ గురించి గొప్ప విష‌యాలు వింటున్నాను’’ అని ట్వీట్ చేశారు. దానికి తేజు కూడా రియాక్ట్ అవుతూ ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజున 12 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రెండో రోజున వసూళ్లు మరింత పెరిగినట్టుగా చెబుతున్నారు. ఇక ఆదివారం కూడా ఈ సినిమా వసూళ్లు ఒక రేంజ్ కి చేరుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.