ఈనెల 11 నుంచి పాదయాత్ర చేపట్టనున్న వైఎస్ షర్మిల

హైదరాబాద్: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాదయాత్రను మళ్లీ ప్రారంభించనున్నారు. పాదయాత్రను ఈనెల 11 నుంచి పునఃప్రారంభిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో తమ సత్తా చాటడానికి వైఎస్ షర్మిల తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలంగాణ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులకు మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు.

రాష్ట్రంలోని 90 నియోజకవర్గాలు 14 పార్లమెంట్ నియెజకవర్గాల్లో 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల పరిధి లక్ష్యంగా గతేడాది అక్టోబర్ 20న ప్రజాప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. జిల్లాల్లో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తెరాస ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు, కరోనా కారణంగా నవంబర్9న ఈ పాదయాత్ర వాయిదా పడింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/