తెలంగాణలో లాక్‌డౌన్‌ పూర్తిగా ఎత్తివేత

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కరోనా కేసులు, పాజిటివిటీ రేటు తగ్గిందంటూ వైద్యారోగ్య శాఖ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అన్ని రకాలు కోవిడ్ నిబంధనలను ఎత్తేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ రోజు నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయి. దీంతో, అన్ని కార్యాలయాలు, షాపులు బస్సులు, మెట్రో సర్వీసులు పూర్తి స్థాయిలో నడవనున్నాయి. అయితే అంతరాష్ట్ర బస్ సర్వీసులపై మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 

కాగా, లాక్‌డౌన్‌, వర్షపాతం, వానాకాలం సాగు, వ్యవసాయ సంబంధిత అంశాలపై కేబినెట్‌ చర్చ చేపట్టింది. దాంతో పాటుగా గోదావరి వాటర్‌ లిఫ్ట్‌, హైడల్‌ పవర్‌ ఉత్పత్తితో పాటు పలు అంశాలపై కేబినెట్‌ చర్చిస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/