తిరిగి డ్యూటీలో చేరిన డీజీపీ మహేందర్ రెడ్డి

హైదరాబాద్: రెండు వారాల మెడికల్ లీవ్ తరువాత తిరిగి డ్యూటీలో చేరారు తెలంగాణ రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి. ఈ ప్రకటనని ఆయనే స్వయంగా తెలిపారు. ఐపీఎస్ అధికారిగా నియామకం అయిన తర్వాత మొట్టమొదటి సారిగా ఇదే తన మెడికల్ లీవ్ అని అన్నారు. ఎప్పుడూ ఒక్కరోజు కూడా మెడికల్ లీవ్ పెట్టలేదని.. ఇప్పుడే రెండువారాలు లీవ్ పెట్టానని మహేందర్ రెడ్డి వెల్లడించారు. కాగా రెండు వారాల క్రితం… బాత్రూం లో కాలు జారి పడ్డ డీజీపీ మహేందర్ రెడ్డి… రెండు వారాల పాటు లీవ్ పెట్టారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/