కొండగల్ లో రేవంత్ ఫై నిప్పులు చెరిగిన వైస్ షర్మిల

వైస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొడంగల్ నియోజకవర్గం లో పాదయాత్ర చేస్తూ..టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫై నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డిని ఓడించారని .. కొడంగల్ లో ముఖం చల్లని రేవంత్ రెడ్డి మొహం రాష్ట్రం మొత్తం చేల్లుతుందా అంటూ ప్రశ్నించారు. అంతే కాదు టిఆర్ఎస్ నేతలపై కూడా షర్మిల విమర్శలు కురిపించింది. పాదయాత్ర లో భాగంగా షర్మిల ఈరోజు కొండగల్ నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టింది. నియోజకవర్గ కేంద్రం బండ ఎల్లమ్మ దేవాలయం నుండి పాదయాత్ర చేపట్టిన షర్మిల..పాదయాత్ర అనంతరం మాట్లాడుతూ.. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ రెడ్డిని ఓడించారని అన్నారు. కొడంగల్ లో ముఖం చల్లని రేవంత్ రెడ్డి మొహం రాష్ట్రం మొత్తం చేల్లుతుందా అంటూ ప్రశ్నించారు.

టిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు వచ్చి బంగారు కొడంగల్ చేస్తా అని చెప్పారు..చేశారా? అని ప్రశ్నించారు. కోస్గికి బస్ డిపో అన్నారు..ఇంతవరకు ఇవ్వలేదని విమర్శించారు. చిన్న దొర కేటీఆర్ వచ్చి కొడంగల్ ను దత్తత తీసుకొని సిరిసిల్లలా చేస్తా అని అన్నారు. దత్తత తీసుకోలేదు కదా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. చిన్న దొర కాలికి దెబ్బ తగిలితే ఆయన మెదడు పనిచేయడం లేదంటూ ఎద్దేవా చేశారు.

రేపు పెద్ద నందిగామ క్రాస్ రోడ్డు నుండి షర్మిల పాదయాత్ర ప్రారంభమై పర్సా పూర్, హస్నాబాద్ మీదుగా, కొత్తగా ఏర్పడ్డ దుద్యాల మండలం లోని దుద్యాల, మరియు లగచర్ల గ్రామ స్టేజి వరకు పాదయాత్ర కొనసాగిస్తారు. గురువారం దుద్యాల మండలం, హకీమ్ పేట్ నుండి ప్రారంభ మై పోలేపల్లి స్టేజి,కోస్గి మండలం లోని సర్జఖాన్ పేట్, కోస్గి, చెన్నారం గ్రామాల మీదుగా యాత్ర కొన సాగి…ముక్తి పాడు చేరిక..వైస్సార్ విగ్రహానికి షర్మిల నివాళులు అర్పిస్తారు.

12వ తేదీన కోస్గి మండలం ముశ్రీఫాలో తిరిగి యాత్ర ప్రారంభమై దౌల్తాబాద్ మండలం లోని సూరాయి పల్లి, బోల్వోని పల్లి, బంటోని బావులు, చల్లాపూర్ వరకు కొనసాగనుండగా.. ఈర్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన వైస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం ఊరకుంటా, దౌల్తాబాద్ వరకు యాత్ర కొనసాగిస్తారు. ఆగస్టు 13 న తిరిగి దౌల్తాబాద్ మండలం లో యాత్ర ప్రారంభమై పోచమ్మ గడ్డ, ర్యాలకుంట, రామన్న కుంట తండా, తిమ్మారెడ్డి పల్లి క్రాస్ రోడ్డు, గోక ఫస్లా బాద్, పోల్కం పల్లి క్రాస్ నంద్యా నాయక్ క్రాస్ రోడ్డు మీదుగా దేవరఫస్ల బాద్ వరకు కొనసాగించనున్నారు. మద్దూర్ మండలం లోని దమగన్ పూర్ లో మాట ముచ్చట్ల తో… నాగిరెడ్డి పల్లి లో ప్రజా ప్రస్థాన యాత్ర ముగించనున్నారు.