హైదరాబాద్‌లో కరోనా బాబా అరెస్టు

నగరంలో కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్న బాబా

psycho killer arrested in tamil nadu
arrested

హైదరాబాద్‌: మియాపూర్‌లోని హఫీజ్‌పేటలో కరోనా వ్యాధిని నమం చేస్తానంటూ మోసాలకు పాల్పడుతున్న కరోనా బాబా అలియాస్‌ ఇస్మాయిల్‌ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. మియాపూర్‌లో ఇస్మాయిల్‌ బాబా అనే వ్యక్తి భక్తుల్లో ఉండే భయాన్ని ఆసరాగా తీసుకుని, వారి సమస్యలు తీర్చుతానంటూ వారికి తాయత్తులు కట్టి డబ్బు సంపాదించుకునే వాడు. ప్రజల్లో కరోనా భయం ఎక్కు కరోనా భయాన్ని క్యాష్ చేసుకుంటున్నవయిపోవడంతో కొత్త బిజినెస్ మొదలు పెట్టాడు.

కరోనా రాకుండా చేస్తానని వారిని నమ్మించాడు. కరోనాకు మందు ఇస్తానంటూ రూ.12 వేల చొప్పున భక్తుల నుంచి వసూలు చేశాడు. అయితే, అతడు డబ్బులు తీసుకున్నప్పటికీ కరోనాకు మందు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇస్మాయిల్‌ బాబాను హఫీజ్‌పేట్‌ హనీఫ్‌ కాలనీలో అదుపులోకి తీసుకున్నారు. అతడిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/