రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన షర్మిల

పట్టుదల, సహనంతో ప్రజల్లో స్ఫూర్తిని నింపాలని ఆకాంక్ష

sharmila-greets-rahul

హైరాబాద్ః నేడు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు వైఎస్‌ఆర్‌టిపి అధ్యక్షురాలు షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. హ్యాపీ అండ్ వండర్ ఫుల్ బర్త్ డే అంటూ గ్రీటింగ్స్ తెలియజేశారు. మీ పట్టుదల, సహనం, హృదపూర్వక ప్రయత్నాల ద్వారా ప్రజల్లో స్ఫూర్తిని నింపాలని, వారికి సేవ చేయడాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. మీరు ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నారు.

కాగా, గత కొంతకాలంగా చోటుచేసుకున్న పరిణామాలను పరిశీలిస్తే షర్మిల కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుతున్నట్టుగా తెలుస్తోంది. త్వరలో ఆమె కాంగ్రెస్‌తో కలిసి పనిచేయనున్నట్టుగా అధికారికంగా ప్రకటన చేయనున్నారని.. వైఎస్‌ఆర్‌టిపిని హస్తం పార్టీలో విలీనం చేయబోతున్నట్టుగా ప్రచారం సాగుతుంది. షర్మిల ఇటీవల వ్యవహరిస్తున్న తీరు కూడా ఈ ప్రచారానికి బలం చేకూరుస్తోంది. తాజాగా వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఈ సందర్భంగా రాహుల్‌పై ప్రజాసేవను కూడా కొనియాడారు. రాహుల్ ఆయన ప్రయత్నాల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్టుగా షర్మిల పేర్కొన్నారు.