9 ఏళ్ల కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ నాయకులు తప్ప ఏ ఒక్క వర్గం బాగుపడలేదు- వైస్ షర్మిల

Sharmila Fires on KCR

YSRTP అధినేత వైస్ షర్మిల ..మరోసారి కేసీఆర్ ప్రభుత్వం ఫై విరుచుకుపడింది. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో బీఆర్ఎస్ నాయకులు తప్ప ఏ ఒక్క వర్గం బాగుపడలేదని ఆరోపించింది. లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టాలని షాద్ నగర్ లో ధర్నా చేస్తున్న ప్రతిపక్షాలు, రైతు సంఘాలకు షర్మిల మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ లాంటి వ్యక్తి పందిరేస్తే కుక్కతోక తాకి కూలిపోయిందంటా..అందుకే కాళేశ్వరం ప్రాజెక్టు కడితే మూడు నెలలకే మునిగిపోయిందన్నారు. కాంట్రాక్టర్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని కేసీఆర్ లక్ష కోట్లకు పెంచిండని ఫైర్ అయ్యింది. కేసీఆర్ .. కమీషన్ల చంద్రశేఖర్ రావుగా పేరు మార్చుకోవాలని షర్మిల ఘాటైన వ్యాఖ్యలు చేసింది. కమీషన్ల కోసమే రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులను కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డికి కట్టబెడుతున్నారని వెల్లడించారు. పాలమూరు, మిషన్ భగీరథ ఇలా అన్ని కాంట్రాక్టులు మెఘా కృష్ణారెడ్డికే ఇస్తున్నారని.. ఎందుకంటే మెఘా కృష్ణారెడ్డి కేసీఆర్ కు కమీషన్ ఇస్తారని ఆరోపించారు.