నేడు పోలీస్ ఉద్యోగాల దరఖాస్తులకు చివరి తేదీ

హైదరాబాద్ : పోలీస్, ఎక్సైజ్, జైళ్లు, అగ్నిమాపకశాఖల్లో పోస్టులకు దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. గురువారం రాత్రి 10 గంటల వరకు అప్లయ్ చేసుకునే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా యూనిఫాం సర్వీసుల్లోని అన్ని విభాగాల్లో కలిపి 17,516 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20న దరఖాస్తు గడువు ముగిసింది.
అయితే అభ్యర్థుల కోరికమేరకు ప్రభుత్వం మరో రెండేండ్లు వయోపరిమితి పెంచింది. ఈ నేపథ్యంలో దరఖాస్తుకు ఈ నెల 26 వరకు గడువు పొడిగించారు. ఇప్పటివరకు 13 లక్షల దరఖాస్తులు వచ్చాయని, చివరి రోజుకావడంతో అభ్యర్థులు పెద్దసంఖ్యలో అప్లయ్ చేసుకునే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/