పవన్ ‘BRO’ నుండి అదిరిపోయే అప్డేట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘BRO’ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. తమిళ చిత్రం వినోదయ సీతమ్ కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే అందిస్తుండగా , థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దేవుడి పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. అలాగే ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడిగా నటిస్తున్నారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి.. టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే సాయి ధరమ్ తేజ్ సరసన రొమాంటిక్ సినిమా హీరోయిన్ కేతికా శర్మ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుంది. ఫాంటసీ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం బ్యాక్‌ టు బ్యాక్‌ అప్‌డేట్‌లతో సినిమాపై మంచి అటెన్షన్‌ క్రియేట్‌ చేస్తున్నారు.

ఈ సినిమాలో మేకర్స్‌ ఓ క్రేజీ ఐటెం సాంగ్‌ను ప్లాన్‌ చేస్తున్నారట. ప్రస్తుతం థమన్‌ అదే పనిలో ఉన్నాడట. ఈ పాట కోసం బాలీవుడ్‌ భామ దిశాపటానీతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. మరో ఆప్షన్‌గా శృతిహాసన్‌ను కూడా పరిశీలనలో ఉంచారట. ఇక ఈ పాట కోసం మేకర్స్‌ బాగానే ఖర్చు పెడుతున్నట్లు టాక్‌. ఇక ఇప్పటికే ఈ సినిమా కోసం అన్నపూర్ణ స్డూడీయోస్‌లో ఓ కాస్ట్‌లీ పబ్‌ సెట్‌ను నిర్మిస్తున్నారట. మరీ ఆ ఐటెం పాట పబ్‌లోనే ఉంటుందా లేదంటే స్పెషల్‌గా ఉంటుందనేది తెలియాల్సి ఉంది.