పట్టాలు తప్పిన సబర్మతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

ఇటీవల వరుస రైలు ప్రమాద ఘటనలు ప్రయాణికులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఓ చోట రైలు ప్రమాద వార్త వినిపిస్తూనే ఉంది. తాజాగా సబర్మతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటన మదర్ రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో గూడ్స్ రైలు ఢీకొనడంతో సబర్మతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ కు చెందిన నాలుగు కోచులు పట్టాలు తప్పాయి. మదర్ రైల్వే స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 1:04 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేయడంతో ప్రమాద తీవ్రత తగ్గినట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని.. ట్రాక్ పునరుద్ధరణ పనుల కోసం యాక్సిడెంట్ రిలీఫ్ రైలు మదర్ చేరుకోవడంతో రైల్వే అధికారులు తక్షణ చర్యలు చేపట్టారని నార్త్ వెస్ట్రన్ రైల్వేకు చెందిన సీనియర్ అధికారి వెల్లడించారు. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తుంది.