నేడు బిఆర్ఎస్ లోకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

బీఎస్పీకి గుడ్ బై చెప్పిన రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనను నాగర్ కర్నూల్ లోక్‌సభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించే అవకాశముంది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని.. రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం తాను బీఆర్ఎస్‌లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించడం జరిగింది.

ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను ఇటీవల కలిసిన విషయం తెలిసిందే. ఈ సమావేశంలోనే పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తుపై చర్చించారు. అప్పుడే పొత్తు ఉంటుందని ప్రకటించారు. ఈ క్రమంలోనే బీఎస్పీ అధినేత్రి మాయామవతి కూడా బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు అంగీకరించారు. ః ఈ నేపథ్యంలోనే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఎస్పీ, బీఆర్ఎస్ పార్టీలు పోటీ చేస్తాయని రాజకీయంగా జరుగుతుండగానే.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ బీఎస్పీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దమయ్యారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆయనతోపాటు బీఎస్పీ రాష్ట్ర నేతలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.