ముగిసిన పీఈసీ సమావేశం

Revanth Reddy responded to the cabinet’s decisions through social media

గాంధీ భవన్ లో సీఎం రేవంత్ అధ్యక్షతన కాంగ్రెస్ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (పీఈసీ) సమావేశం ముగిసింది. ఎంపీ అభ్యర్థుల విషయంలో సభ్యుల అభిప్రాయాలను నేతలు తీసుకున్నారు. ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీకి పంపనుంది. 15 లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశం ఉందని సీఎం రేవంత్ చెప్పినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా 17 ఎంపీ స్థానాలకు 309 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇదిలా ఉంటె గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో జరిగిన మిషన్ భగీరథ పనులపై సీఎం రేవంత్ రెడ్డి విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. చాలాచోట్ల పైప్లాన్లు వేయకుండానే, మెటీరియల్ కొనకుండానే కాంట్రాక్టర్లు బిల్లులు తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.