కేటీఆర్ కు షర్మిల కౌంటర్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు వైఎస్ షర్మిల కౌంటర్ ఇచ్చింది. రీసెంట్ గా కేటీఆర్ పలు మీడియా చానెల్స్ లలో వరుస ఇంటర్వూస్ ఇచ్చి బిజెపి , కాంగ్రెస్ పార్టీ ల ఫై పలు వ్యాఖ్యలు చేసారు. అలాగే తెలంగాణ లో పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్న వైస్.షర్మిల ఫై కూడా పలు కామెంట్స్ చేసారు. అన్న మీద కోపం ఉంటే తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడం ఏంటని.. షర్మిల లాంటి వాళ్ళు బీజేపీ ఏజెంట్లు అంటూ కేటీఆర్ కామెంట్స్ చేసారు.

కేటీఆర్ వ్యాఖ్యలపై షర్మిల కౌంటర్ ఇచ్చింది. అన్న మీద కోపం ఉంటే ఇక్కడ పార్టీ పెట్టడం ఏంటని కేటీఆర్ అంటున్నాడని, నాకు మా ఆన్న మీద కోపం ఉంటే ఇక్కడ లాభం లేదు అనే ఇంగిత జ్ఞానం ఉంది కదా మండిపడ్డారు. ఆ మాట లో నిజం లేదు కాబట్టే…అక్కడ పార్టీ పెట్టలేదు… ఇక్కడ పార్టీ పెట్టానని స్పష్టం చేసింది. బీజేపీతో మాకు పొత్తు ఉందని కేటీఆర్ మాట్లాడుతున్నారని, బీజేపీ తో డ్యూయెట్లు పాడింది మీరు కాదా అని ఆమె ప్రశ్నించారు. మీరు తెరవెనుక పొత్తు పెట్టుకొని మమ్మల్ని అంటారా అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మాకు ఎవరితో పొత్తులు లేవని, మేము ఎవరికి ఏజెంట్లు కాము అని ఆమె వెల్లడించారు.