బోండా ఉమా చిల్లర రౌడీ – వాసిరెడ్డి పద్మ

ఏపీలో వాసిరెడ్డి పద్మ vs బోండా ఉమా వార్ నడుస్తుంది. విజయవాడ అత్యాచార బాధితురాలి అంశంలో చంద్రబాబు , బోండా ఉమా లకు వాసిరెడ్డి పద్మ సమన్లు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ జారీ అనంతరం బోండా ఉమా..పద్మ ఫై పలు వ్యాఖ్యలు చేసారు. ఈ వ్యాఖ్యలకు వాసిరెడ్డి పద్మ కౌంటర్ ఇచ్చింది. సోమవారం విజయవాడ లో మాట్లాడుతూ..బోండా ఉమా ఆకు రౌడీ కూడా కాదు చిల్లర రౌడీ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కాలకేయ ముఠాకు నాయకుడు చంద్రబాబు. బోండా ఉమ వల్ల చంద్రబాబుకు చెడ్డ పేరొచ్చిందని టీడీపీ వాళ్లే తిడుతున్నారు. టీడీపీ వాళ్లే తిడుతుండటంతో బోండా ఫ్రస్టేషన్‌లో ఉన్నాడు. బోండా ఆకు రౌడీ అనుకున్నా.. కానీ మరీ చిల్లర రౌడీలా వ్యవహరిస్తున్నాడు. ఏప్రిల్ 27న కమిషన్ ముందుకు రావడానికి చంద్రబాబు, బోండా ఉమాకు భయమేంటి. కమిషన్ ముందు హాజరయ్యే ధైర్యం మీకు లేదా.. మహిళా కమిషన్ పదవి ఊడే వరకూ పోరాడతానని బోండా చెబుతున్నాడు. నేను మహిళా కమిషన్ ఛైర్మన్‌గా దిగిపోవడం బోండా ఉమ ఆశయమా. నా పదవి పోయే వరకూ పోరాడమని చంద్రబాబు బోండాకు చీర కట్టి పంపించాడు. బోండా ఉమ తన పేరును సార్ధకం చేసుకుంటున్నాడు అంటూ పద్మ ఆగ్రహం వ్యక్తం చేసింది.