ఒడిషాలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదు

ఇటలీ నుండి ఒడిషాకు వచ్చిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌

Coronavirus
Coronavirus

భువనేశ్వర్‌: కరోనా వైరస్‌ (కొవిడ్‌-19) రాష్ట్రంలోరోజురోజుకు వ్యాప్తి చెందుతోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఈ వైరస్ రోజు రోజుకి తీవ్రంగా ప్రబలుతూనే ఉంది. దేశంలో ఇప్పటికే పలు రాష్ట్రాల్లో వ్యాప్తి చెందిన కరోనా తాజాగా ఒడిషాలో మరో వ్యక్తికి సోకింది. దీంతో రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదు అయినట్టు అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తి కొద్ది రోజుల క్రితం ఇటలీ నుండి ఒడిషాకు వచ్చినట్టు తేలింది. దీంతో అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ తేలినట్టు వైద్యులు తెలిపారు. వైద్యులు అతడికి చికిత్స అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/