భారత్‌ నిర్మాణంలో వారి పాత్ర కీలమైంది

దేశం మొత్తం వలస కార్మికులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది

YouTube video
AICC Press Briefing By Shri Rahul Gandhi via video conferencing

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఈరోజు మీడియాతో మాట్లాడుతూ.. లక్షలాది మంది వలస కూలీలు కాలినడకన వారి సొంతూళ్లకు వెళ్లున్నారు. వారికి మార్గ మధ్యలో ఆహార సదుపాయాల్లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. పేద ప్రజలు జేబుల్లో డబ్బు లేక ఏమీ కొనుక్కోలేని పరిస్థితి. అందువల్ల వారి జేబుల్లోకి డబ్బు నేరుగా చేరే విధంగా చూడండి. ప్రధాని ఆర్థిక ప్యాకేజీ విషయంలో పునరాలోచించాలి అని ఆయన సూచించారు. దేశం మొత్తం వలస కార్మికులకు మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. భారత్‌ నిర్మాణంలో వలస కార్మికుల పాత్ర కీలమని రాహుల్‌ అన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/