ఉద్ధవ్‌ థాకరే కేబినెట్‌లో చక్రం తిప్పిన శరద్‌ పవార్‌

మహా వికాస్‌ అఘాడి సర్కారులో కీలక పదువులు సాధించుకున్న ఎన్‌సీపీ

Sharad Pawar
Sharad Pawar

ముంబయి: మహరాష్ట్ర మహా వికాస్‌ అఘాడి సర్కారులో కీలక పదవులు సాధించుకోవడంలో ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ చక్రం తిప్పారు. ముఖ్యమంత్రి ఉద్దవ్‌ థాకరే సారథ్యంలోని ఆదివారం జరిగిన శాఖలో కేటాయింపులో రెండు కీలక పదవులు దక్కించుకుంది. శరద్‌ పవార్‌ అన్న కుమారుడు అజిత్‌ పవార్‌ ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పదవిని చేపట్టగా, ఇప్పుడు మరో రెండు కీలకమైన పదవులు ఎన్‌సీపీ దక్కించుకుంది. అజిత్‌ పవార్‌కు కీలకమైన ఆర్థిక శాఖ దక్కగా, మరో ముఖ్యనేత అనిల్‌ దేశ్‌ముఖ్‌కు హోంశాఖ వరించింది. ఎన్‌సీపీ ఎమ్మెల్యేలు జయంత్‌ పాటిల్‌కు ఇరిగేషన్‌, ఛగన్‌ భుజ్‌బల్‌కు ఆహారం, పౌర సరఫరాలు, దిలీప్‌ వాల్సే పాటిల్‌కు ఎక్సైజ్‌, ధనుంజ§్‌ు ముండేకు సామాజిక న్యాయం శాఖల దక్కాయి.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/