రుణాలపై మరో మూడు నెలల మారటోరియం!

అతి త్వరలో ఆర్బీఐ నిర్ణయం తీసుకునే అవకాశం

Reserve Bank of India
Reserve Bank of India

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా కేంద్రం లాక్‌డౌన్‌ను మే 17 వరుకు పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న వారు ఇబ్బందుల్లో కూరుకుపోకుండా చూసేందుకు బ్యాంకు రుణాల వసూళ్లపై విధించిన మారిటోరియాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) మరింత పొడిగించే సూచనలు కనిపిస్తున్నాయి. రుణ వాయిదాల వసూళ్లను మూడు నెలలు వాయిదా వేస్తున్నట్టు మార్చి 27న ప్రకటించింది. ఇది ఈ నెలాఖరుతో ముగుస్తుంది. మారిటోరియాన్నీ మరో మూడు నెలలు పొడిగించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) ఇప్పటికే ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. అయితే వీటిపై సమీక్షించిన ఆర్బీఐ, మే 31తో ముగియనున్న మారటోరియం వ్యవధిని, ఆగస్టు వరకూ పొడిగించేలా నిర్ణయం తీసుకునే యోచనలో ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/