పంజాబ్‌ స్పీకర్‌ తో పాటు ఇద్దరు మంత్రులకు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీ

పంజాబ్ రాష్ట్రంలో ఓ కేసులో ఆ రాష్ట్ర శాసనసభ స్పీకర్, ఇద్దరు కేబినెట్ మంత్రులకు నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్‌తోపాటు మంత్రులు ఉర్మీత్‌ సింగ్‌ మీట్‌ హయర్‌, లాల్జిత్‌ సింగ్‌ భుల్లార్‌, మరో తొమ్మిది మంది అధికార ఆప్‌ నాయకులు, కార్యకర్తలకు వారెంటు ఇచ్చింది.

పంజాబ్‌లోని అమృత్‌సర్‌, తర్న్‌ తరాజ్‌ జిల్లాల్లో కల్తీ మద్యం సేవించి సుమారు 100 మందికి మరణించారు. దీనికి వ్యతిరేకంగా ఆమ్‌ఆద్మీ పార్టీ నాయకులు 2020, ఆగస్టు 20న అమృత్‌సర్‌లోని జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ కాంప్లెక్స్‌ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. ఆ సమయంలో కరోనా ఆంక్షలు అమలులో ఉండటంతో పోలీసులు డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద కుల్తార్‌ సింగ్‌, గుర్మీత్‌ సింగ్‌, లాల్జిత్‌ సింగ్‌ సహా పలువురిపై కేసు నమోదుచేశారు. అయితే వారు కేసు విచారణ సందర్భంగా కోర్టుకు హాజరు కాకపోవడంతో.. ఆగ్రహం వ్యక్తంచేసిన న్యాయమూర్తి వారికి నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీచేశారు.