ఎట్టకేలకు ‘బేషరమ్ రంగ్’ సాంగ్ లో దీపికా క్లోజప్ షాట్స్ తొలగింపు

ఎట్టకేలకు ‘బేషరమ్ రంగ్’ సాంగ్ లో దీపికా క్లోజప్ షాట్స్ ను తొలగించారు మేకర్స్. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొనె జంటగా సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘పఠాన్’. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘బేషరమ్ రంగ్’ సాంగ్ రిలీజ్ అయ్యినదగ్గరి నుండి ఈ సాంగ్ ఫై వివాదాలు అట్టుకున్నాయి. ఈ సాంగ్ లో దీపిక పదుకోన్ అంగాంగ ప్రదర్శన, అందాల ఆరబోతపై నెటిజన్లు, రాజకీయ పార్టీలు భగ్గుమన్నాయి. ఈ సాంగ్ ను తొలగించాలని పెద్ద ఎత్తున ఆందోళలనలు , నిరసనలు చేసారు. సినిమాను విడుదల కానివ్వబోమంటూ పలువురు నాయకులు హెచ్చరించారు. పనిలో పనిగా సెన్సార్ బోర్డుపైనా విరుచుకుపడ్డారు.

తాజాగా, ఈ సినిమాను సెన్సార్ బోర్డు వీక్షించింది. సినిమా చూసిన సెన్సార్ అధికారులు సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే, పలు కట్స్ సూచించింది. ‘బేషరమ్ రంగ్’ పాటలో దీపిక స్విమ్ సూట్‌లో ఉన్న మూడు క్లోజప్ షాట్స్‌తోపాటు కొన్ని డ్యాన్స్ మూమెంట్స్‌ను తొలగించాలని ఆదేశించింది. సినిమాకు మొత్తంగా 10కిపైగా కట్స్ సూచించింది. దీంతో సినిమా విడుదల సమయానికి మార్పులు చేయనున్నట్టు చిత్ర బృందం తెలిపింది. ఇక రన్ టైం వచ్చేసి 2.26.16 గంటలగా తేల్చింది. ఈ నెల 25 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

YouTube video