శ్రీహరికోటలో మరో విషాదం..

Suicide that the corona got positive
suicide

శ్రీహరికోటలో వరుస ఆత్మహత్యలు సంచలనం రేపుతున్నాయి. మొన్న జవాన్ ..నిన్న ఎస్సై..నేడు మరొకరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇలా వరుస ఆత్మహత్యలు అనేక అనుమానాలకు దారితీస్తుంది. అసలు ఏంజరుగుతుందని అంత ఆరాతీస్తున్నారు. మొన్న జవాను చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మాట్లాడుకుంటుండగానే..నిన్న సిఐఎస్ఎఫ్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఉత్తరప్రదేశ్ కు చెందిన వికాస్ సింగ్ అనే వ్యక్తి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేవలం మూడు నెలల క్రితమే శ్రీహరికోటలో ఎస్సైగా చేరాడు. ఎస్సై వికాస్ సింగ్ కి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

నేడు వికాస్‌సింగ్‌ సతీమణి సైతం ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు సంచలనం రేపుతోంది. నర్మద గెస్ట్‌ హౌస్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. నిన్న తుపాకీతో కాల్చుకొని వికాస్‌సింగ్‌ ఆత్మహత్య చేసుకున్నారు. భర్త మృతి విషయం తెలుసుకొని ఆమె.. నిన్న తన అన్నతో కలిసి శ్రీహరికోటకు వచ్చారు. భర్త వికాస్‌సింగ్‌ మృతిని తట్టుకోలేకే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వికాస్‌ సింగ్‌కు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో కుమారుడు ఒకటో తరగతి, కుమార్తె ఎల్‌కేజీ, మరో కుమార్తె చిన్నపాప. ఇందులో ఓ కుమార్తె వికలాంగురాలు.