హాస్పటల్ లో చేరిన కింగ్​ ఖాన్

కింగ్​ ఖాన్ షారుఖ్ ఖాన్ హాస్పటల్ లో చేరిన విషయం అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది. అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియంలో 2024 ఐపీఎల్​ ప్లేఆఫ్స్​ మ్యాచ్​లు జరుగుతున్నాయి. షారుక్ సొంత ఫ్రాంచైజీ కోల్​కతా నైట్​రైడర్స్​ ప్లేఆఫ్స్​లో భాగంగా మంగళవారం సన్​రైజర్స్​తో తలపడింది. ఈ మ్యాచ్​లో తన జట్టును ప్రోత్సహించేందుకు షారుక్ ఫ్యామిలీతో సహా అహ్మదాబాద్ వెళ్లారు. రెండు రోజులుగా వాతావరణంలో ఉష్ణోగ్రత కారణంగా ఆయన డిహైడ్రేషన్‌తో అస్వస్థతకు గురైనట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో స్థానిక కేడీ హాస్పిటల్​లో చేరిన బాద్​షా చికిత్స అనంతరం డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. ‘షారుక్ ఖాన్​ హీట్​ స్ట్రోక్​ కారణంగా ఆయన అస్వస్థకు గురయ్యారు. కేడీ హాస్పిటల్​లో జాయిన్ అయ్యి, ట్రీట్​మెంట్ తీసుకొని డిశ్చార్డి అయ్యారు’ అని అహ్మదాబాద్​ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్​ ఓం ప్రకాశ్​ జత్ పేర్కొన్నారు.

కాగా, షారుక్​ గతేడాది హ్యాట్రిక్ హిట్లను అందుకున్నారు. పఠాన్​, జవాన్​తో చెరో రూ.1000 కోట్ల సాధించిన ఆయన డంకీ మరో రూ.500కోట్ల వరకు వసూలు చేశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఆయన మరో సినిమాను అఫీషియల్​గా అనౌన్స్ చేయలేదు. కానీ కింగ్ అనే సినిమా చేస్తున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. ఈ చిత్రంతోనే షారుక్ కూతురు సుహానా ఖాన్ కూడా వెండితెర అరంగేట్రం చేయనుందని తెలిసింది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్​ అనిరూధ్​ మ్యూజిక్ అందిస్తున్నారట. సుజయ్ ఘోష్ దర్శకత్వం వహిస్తున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్​పై సిద్ధార్థ్​ ఆనంద్​తో కలిసి షారుక్ ఈ​ సినిమాను నిర్మిస్తున్నారు.