మాచర్లలో టెన్షన్ వాతావరణం.. టీడీపీ నేతల హౌస్ అరెస్టు

టీడీపీ నేతలు ‘ఛలో మాచర్ల’కు పిలుపునివ్వడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ పార్టీ నేతలు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, నక్కా ఆనంద్ బాబు, దేవినేని ఉమ తదితరులకు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే నడికుడి వద్ద చెకోపోస్టు ఏర్పాటుచేసి తనిఖీలు చేపట్టారు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ తాము మాచర్లకు వెళ్తామని టీడీపీ నేతలు చెబుతుండటంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.

పోలింగ్ రోజున నియోజకవర్గంలో వైసీపీ నాయకుల దాడిలో గాయాలపాలైన టీడీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు ఛలో మాచర్లకు పిలుపునిచ్చారు. ఉదయం 9గంటలకు గుంటూరులోని మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంటి నుంచి ర్యాలీగా నేతలు బయలుదేరగా..పోలీసులు వారిని అడ్డుకున్నారు.