మెగా బ్రదర్ ను కలుసుకున్న బిగ్ బాస్ ఫేమ్ పింకీ

బిగ్ బాస్ 5 తో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న పింక్ అలియాస్ ప్రియాంక సింగ్..మెగా బ్రదర్ నాగబాబు ను కలుసుకుంది. జబర్ధస్త్‌లో లేడీ గెటప్‌లు వేసుకుంటూ మంచి గుర్తింపును అందుకున్నాడు సాయితేజ (పింకీ). ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో జెండర్‌ను మార్చుకోవాలన్న కోరికతో ఆ తర్వాత సర్జరీ చేయించుకుని అమ్మాయిలా మారిపోయాడు. ఆ సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. అలాగే, ఇప్పుడు గతంలో మాదిరిగా అవకాశాలను కూడా అందుకోలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈ క్రమంలో పింకీ కి బిగ్ బాస్ 5 లో ఛాన్స్ దక్కింది.

ట్రాన్స్‌జెండర్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన ప్రియాంక .. తమన్నా సింహాద్రి లాగే ఎక్కువ రోజులు షోలో కొనసాగలేదని చాలామంది భావించారు. అయితే అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 13 వారాల పాటు హౌస్‌లో కొనసాగింది. బిగ్‌బాస్‌ షో ప్రారంభం సమయంలో మెగా బ్రదర్‌ నాగబాబు పింకీకి మద్దతునిచ్చిన సంగతి తెలిసిందే. ఆమే విజేతగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన పింకీ తాజాగా నాగబాబును కలిసింది. ఆయన ఆశీర్వాదం తీసుకుంది.

ఈ సందర్భంగా మెగాబ్రదర్‌ పింకీపై ప్రశంసలు కురిపించారు. ‘ఎన్నో అసమానతలు, అడ్డంకులు, అవమానాలను ఎదుర్కొని నువ్వు సంపాదించిన ఈ గొప్ప స్థానం ప్రజల హృదయాలలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నువ్వు బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలవకపోవచ్చు. కానీ నిత్యం సమాజంలో నిత్యం నీలా అవమానాలు, హేళన ఎదుర్కొనే వారికి నువ్వు ఒక స్ఫూ్ర్తిగా నిలిచావు. జీవితంలో గెలవచ్చన్న ఆత్మవిశ్వాసాన్ని వారికి అందించావు. నా ప్రేమాభిమానాలు, మద్దతు నీకు ఎప్పుడూ ఉంటాయి’ అని నాగబాబు రాసుకొచ్చారు.

View this post on Instagram

A post shared by Naga Babu Konidela (@nagababuofficial)