శాకుంతలం నుండి మరో మెలోడీ సాంగ్ రిలీజ్

సమంత ప్రధాన పాత్రలో డైరెక్టర్ గుణ శేఖర్ డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్న మూవీ శాకుంతలం. మహా శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17 న విడుదల చేయాలనీ భావించినప్పటికీ , పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడం తో ఏప్రిల్ 14 కు వాయిదా వేశారు. ఓ పక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతూనే , చిత్ర ప్రమోషన్ ను వేగం వంతం చేస్తున్నారు. ఇప్పటికే సినిమాలోని పలు సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ విడుదల చేసి ఆసక్తి నింపగా, బుధువారం మరో మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేసారు.

మధుర గతమా అంటూ సాగే మెలోడీ గీతాన్ని విడుదల చేశారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటను అర్మాన్‌ మాలీక్‌, శ్రేయా ఘోషల్‌ ఆలపించారు. శ్రీమణీ సాహిత్యం అందించాడు. లేటెస్ట్‌గా రిలీజైన ఈ పాట శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా సాంగ్‌లోని విజువల్స్‌ గ్రాండియర్‌గా ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి రిలీజైన అన్ని పాటలు చార్ట్‌ బస్టర్‌లుగా నిలిచాయి. మణిశర్మ చాలా రోజుల తర్వాత తన స్థాయి ఆల్భమ్ ఈ సినిమాకు అందించాడు. మహాభారత ఆదిపర్వంలోని శకుంతల-దుష్యంతుల అపురూప ప్రణయగాథ ఆధారంగా గుణశేఖర్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌ కనిపించనున్నాడు. మోహన్‌ బాబు కీలకపాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్హ గెస్ట్‌ రోల్‌ పోషించింది.

YouTube video