అఖిల భారత మేయర్ల సదస్సును ప్రారంభించిన ప్రధాని

దేశంలో ఇత‌ర న‌గరాల‌కు కాశీ దిక్సూచీ ప్ర‌ధాని మోడీ

YouTube video
PM Shri Narendra Modi inaugurates All India Mayors’ Conference

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ వార‌ణాసిలో శుక్ర‌వారం అఖిల భార‌త మేయ‌ర్ల స‌ద‌స్సును వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించారు. దాదాపు 120 మంది మేయర్లు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ స‌ద‌స్సులో పాల్గొన్న మేయ‌ర్లు త‌మ న‌గ‌రాల అభివృద్ధి కోసం ఏ చిన్న అవ‌కాశాన్నీ జార‌విడుచుకోర‌నే విశ్వాసం త‌న‌కున్న‌ద‌ని అన్నారు. త‌మ న‌గ‌రాల‌ను ప‌రిశుభ్ర న‌గ‌రాల జాబితాలో ముందుండేలా మేయ‌ర్లు కృషిచేయాల‌ని కోరారు. మ‌నం మ‌న చారిత్రక వార‌సత్వ క‌ట్ట‌డాల‌కు పున‌రుత్తేజం క‌ల్పించాల‌ని అన్నారు.

కాశీలో జ‌రిగిన అభివృద్ధి దేశంలోని ఇత‌ర న‌గ‌రాల‌కు రోడ్‌మ్యాప్ వంటిద‌ని ప్ర‌ధాని అన్నారు. మ‌న దేశంలో చాలా న‌గ‌రాలు సంప్ర‌దాయ న‌గరాల‌ని వాటి అభివృద్ధి కూడా ఇదే త‌ర‌హాలో చేప‌ట్టాల‌ని అన్నారు. ఆయా న‌గ‌రాల్లోని స్ధానిక నైపుణ్యాలు, ఉత్ప‌త్తుల‌ను గుర్తించి ప్రోత్స‌హించ‌డం నేర్చుకోవాల‌ని సూచించారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/