ఏడో రోజు కొనసాగుతున్న జగన్ మేమంతా సిద్ధం యాత్ర
అమరావతిః సిఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏడో రోజుకు చేరుకుంది. ఈనాటి యాత్ర ఉదయం 9 గంటలకు చిత్తూరు జిల్లాలోని అమ్మగారిపల్లె నుంచి ప్రారంభమయింది. ఈరోజు గోడ్లవారిపల్లె, గుండ్లపల్లిలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 4 గంటలకు పూతలపట్టు బైపాస్ రోడ్డు (మొధిగారిపల్లె) వద్ద జరిగే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు. రాత్రికి శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట సమీపంలోని గురువరాజుపల్లెలో జగన్ బస చేస్తారు. ఈనాటి యాత్ర నేపథ్యంలో… చిత్తూరు జిల్లా సిద్ధమా? అని జగన్ ట్వీట్ చేశారు.