నేటి నుంచి చంద్రబాబు రెండో విడత ప్రజాగళం యాత్ర..

Chandrababu second phase of Prajagalam Yatra from today..

అమరావతిః టిడిపి అధినేత చంద్రబాబు ప్రజాగళం యాత్ర పేరుతో ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. మండుటెండలను సైతం లెక్క చేయకుండా… ప్రతిరోజు రెండు నుంచి మూడు సభల్లో ప్రసంగిస్తున్నారు. ఈరోజు నుంచి ఆయన ప్రజాగళం యాత్ర రెండో విడత ప్రారంభం కాబోతోంది. ఈరోజు నరసాపురం, రాజమండ్రి, అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆయన పర్యటించనున్నారు. రావులపాలెం, రామచంద్రాపురంలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొంటారు.

రేపు గోపాలపురం, కొవ్వూరులో రోడ్ షోలు ఉంటాయి. ఏప్రిల్ 5న నరసాపురం, పాలకొల్లు, 6న సత్తెనపల్లి, పెదకూరపాడు… 7న పెనమలూరు, పామర్రులో యాత్ర కొనసాగుతుంది. తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోలను నిర్వహించారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తొలి సభ, సాయంత్రం 6 గంటలకు రెండో సభ నిర్వహించేలా ప్లాన్ చేశారు.