ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌తో భేటీ కానున్న సీఎం కేసీఆర్‌

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కెసిఆర్ నేడు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీకానున్నారు. ఇందులో భాగంగా మరికాసేపట్లో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌తో సమావేశమవనున్నారు. మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ నివాసానికి అఖిలేష్‌ చేరుకుంటారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు జాతీయ రాజకీయాల గురించి చర్చించనున్నారు.

దేశంలో ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన దిశగా ప్రయత్నాలు ప్రారంభించిన సీఎం కేసీఆర్‌ నేడు జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీల నేతలు, ఆర్థికవేత్తలు, మీడియా సంస్థల ప్రముఖులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ అధికారులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా వారితో దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులపై చర్చిస్తారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/