ఈరోజు తెలంగాణ లో ఎన్ని ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయో తెలుసా..?

తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విదేశాల నుండి వచ్చిన వారి కారణంగా రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణ లో నిన్న సోమవారం ఒక్క రోజే 12 కొత్త ఓమిక్రాన్ కేసులు నమోదు కాగా..మంగళవారం కొత్తగా 07 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 62 కు చేరింది. ఇలా రాష్ట్రంలో కేసులు పెరుగుతుండడం తో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరోపక్క న్యూ వేడుకలకు అంత సిద్ధమవుతున్నారు. రాష్ట్ర సర్కార్ సైతం న్యూ ఇయర్ వేడుకలకు మినయింపు లు ప్రకటించింది. ముఖ్యంగా మందు బాబులకు సర్కార్ కిక్ ఇచ్చే న్యూస్ తెలిపింది. మ‌ద్యం దుకాణాలు రాత్రి 10 గంట‌ల వ‌ర‌కు, బార్లు, ప‌బ్‌లు, రెస్టారెంట్లు అర్థ‌రాత్రి ఒంటిగంట వ‌ర‌కు తెరిచి ఉంచేందుకు అనుమ‌తులు ఇచ్చింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న వేళ ప్ర‌త్యేక అనుమ‌తులు ఇవ్వ‌డంతో స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. స‌భ‌లు, ర్యాలీల‌కు అనుమ‌తులు నిరాక‌రించిన ప్ర‌భుత్వం కొత్త సంవ‌త్స‌రం వేడుక‌లకు మ‌ద్యం దుకాణాల‌కు ఎలా అనుమ‌తులు ఇస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

మరోపక్క ఢిల్లీ సర్కార్ ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినిమా హాళ్ల తో పాటు.. షాపింగ్‌ మాల్స్‌, జిమ్‌లు, మల్టీప్లెక్స్‌లు, బాంకెట్ హాల్స్, ఆడిటోరియంలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు తక్షణమే మూసి వేయలని ఆదేశాలు జారీ చేసారు. అలాగే.. మెట్రో, రెస్టారెంట్లు, బార్‌లు 50% సామర్థ్యంతో నడిపించాలని కేజ్రీవాల్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుంది. ఈ తాజాగా ఆదేశాలు ఇవాళ అర్థరాత్రి నుంచే అమలు కానున్నట్లు సీఎం కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ ఉంటుందని సీఎం కేజ్రీవాల్‌ తెలిపారు. ఆటోలు, ట్యాక్సీల్లో ఇద్దరు ప్రయాణికులకు మాత్రమే అనుమతి ఉంటుంది. వివాహాలు, అంత్యక్రియలకు 20మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు.