భీమ్లా నాయక్ నుండి క్రేజీ అప్డేట్..ఫ్యాన్స్ కు పండగే

భీమ్లా నాయక్ నుండి క్రేజీ అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో సంతోషం నింపారు చిత్ర యూనిట్. చిత్రంలోని ఓ ప్రత్యేక పాటను రేపు విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. రానా , పవన్ కళ్యాణ్ కలయికలో భీమ్లా నాయక్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సాగర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ కి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే , మాటలు అందించడం విశేషం. ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని , పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. జనవరి 12 న రిలీజ్ చేయాలనీ అనుకున్నప్పటికీ..సంక్రాంతి బరిలో ఆర్ఆర్ఆర్ , రాధే శ్యామ్ చిత్రాలు ఉండడం తో థియేటర్స్ సమస్య తో పాటు కలెక్షన్ల సమస్యలు ఎదురవుతాయని భీమ్లా నాయక్ వాయిదా పడింది. మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 25 న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు మేకర్స్.

ఈ తరుణంలో సినిమాలోని ప్రత్యేక సాంగ్ అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో సంతోషం నింపారు. ఇప్పటి వరకూ ఈ చిత్రం నుంచి ‘టైటిల్‌ సాంగ్‌, ‘లాలా..భీమ్లా’తోపాటు మాస్‌ లుక్‌ పోస్టర్‌లకు విపరీతమైన రెస్సాన్ప్‌ వచ్చిన సంగతి తెలిసిందే. రేపు బుధవారం మరో పాటతో అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇవ్వనుంది. రేపు 11 గంటలకు ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక పాటను చిత్రబృందం విడుదల చేయనుంది. ఈ విషయాన్ని చిత్న నిర్మాత నాగ వంశీ ట్విట్టర్‌ వేదికగా తెలిపారు. మరి ఆ సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.