దీక్షిత్ మర్డర్ రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు…! పోలీసులకు దొరక్కుండా ఏం చేసాడు…?

మహబూబాబాద్ లో జరిగిన చిన్నారి దీక్షిత్ రెడ్డి కిడ్నాప్ అండ్ మర్డర్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. రిమాండ్ రిపోర్ట్ లో కీలక అంశాలు పోలీసులు ప్రస్తావించారు. సంవత్సరం నుండి డింగ్ టాక్ వాయిస్ ఓవర్ ఇంటర్ నెట్ ప్రోటోకాల్ యాప్ ని తన గర్ల్ ఫ్రెండ్ కి ఫోన్ చేసేందుకు వాడుతున్నాడు. ఆ యాప్ నే కిడ్నాప్ కి వాడుకున్నాడు. తల్లి తండ్రులకు ఆ యాప్ తో కాల్ చేసి డబ్బులు డిమాండ్ చేసాడు.

deekshith-killed-by-kidnappers

మొబైల్ నెంబర్ ద్వారా కాకుండా యాప్ ద్వారా కాల్స్ చేయటంతో పోలీసులకు 3 రోజులు అతని ఆచూకీ పట్టుకోవడం ఇబ్బంది అయింది. అసలు కిడ్నాప్ ఎలా చేసాడో పోలీసులు వివరించారు. పెట్రోల్ బంక్ కు వెళ్దామని దీక్షిత్ ని బండి ఎక్కించుకున్నాడు. తెలిసిన వ్యక్తే అని నమ్మి దీక్షిత్ బండి ఎక్కగా… అప్పటికే మెడికల్ స్టోర్ లో స్లీపింగ్ పిల్స్ కొని పెట్టుకున్నాడు. దారిలో బైక్ ఆపి వాటర్ బాటిల్ కొనుక్కుని అందులో పిల్స్ వేసి బాలుడికి పట్టించాడు.

బాబు మత్తులోకి జారుకున్న తర్వాత స్పృహ రాకుండానే బాలుడుని హత్య చేసాడు. టూవీలర్ స్పేర్ పార్ట్స్ దుకాణం అతను నడిపిస్తున్నాడు. ఒక చౌరస్తా దగ్గరికి బాలుడు తండ్రి రమ్మని చెప్పగా… ఒక షాపులో బాలుడి తండ్రిని గమనించాడు. అయితే సివిల్ డ్రెస్ లో పోలీసులు ఫాలో అవుతున్నారు అనే అనుమానంతో మరో చోటకి రావాలని చెప్పాడు. హత్య తర్వాత బాలుడి తల్లి తండ్రులు ఎలా ఉన్నారో చూడటానికి వెళ్ళాడు. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చే లోపే చంపేసాడు.