అలీ కామెంట్స్ ఫై నాగబాబు రియాక్షన్

కమెడియన్ , వైస్సార్సీపీ నేత అలీ చేసిన కామెంట్స్ ఫై జనసేన కార్య కర్తలు , మెగా అభిమానులు ఆగ్రహం తో ఊగిపోతున్నారు. ప్రాణ స్నేహితుడంటూ చెప్పుకొచ్చిన అలీ..ఇప్పుడు పవన్ కళ్యాణ్ పైనే కామెంట్స్ చేయడం , ఆయన పార్టీని కాదని జగన్ పార్టీ లో చేరడమే కాక ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ పైనే పోటీ చేస్తానని కామెంట్స్ చేయడం తో వారంతా అలీ ఫై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అలీ కామెంట్స్ ఫై జనసేన పార్టీ లోని కొంతమంది నేతలు స్పందించగా..తాజాగా నాగబాబు మాట్లాడుతూ..ఆలీ పోటీ చేస్తానని ప్రకటనపై నో కామెంట్ తేల్చి చెప్పేశారు. అంటే ఆలీపై కామెంట్ చేయడానికి నాగబాబు టైమ్ వేస్ట్ చేసుకోరు అని జనసేన కార్య కర్తలు అంటున్నారు.

అలాగే జనసేన పార్టీ పొత్తు ఫై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. పొత్తులపై తుది నిర్ణయం పవన్ కల్యాణ్‌దే అని, ఆయన ఎలా ముందుకెళితే తాము అలాగే వెళ్తామని చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లాలో మహిళా నేతల సమావేశంలో నాగబాబు ఈ ప్రకటన చేశారు. పొత్తులు లేకుండా ఉంటే కర్నూలు జిల్లాలో అన్ని నియోజక వర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని, పొత్తులు ఉంటే పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ముందుకు వెళతామని చెప్పుకొచ్చారు. అయితే పొత్తులపై నాగబాబుకు కూడా ఒక క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీతో పొత్తు ఫిక్స్ అవుతున్న నేపథ్యంలో ఆయన..ఈ విధంగా పొత్తుల అంశం పవన్ చూసుకుంటారని చెప్పినట్లు అంత మాట్లాడుకుంటున్నారు.