16 ఏళ్ళ నుంచి హైదరాబాద్ లో తప్పించుకుని తిరుగుతూ ఇవాళ దొరికాడు…!

హైదరాబాద్ లో కరుడుగట్టిన నేరస్తుడుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 16ఏళ్ళ నుంచి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 16 ఏళ్లగా తప్పించుకుని తిరుగుతున్న కరుడుగట్టిన రౌడీషీటర్ డేవిడ్ రాజు ను అరెస్టు చేసారు ఎస్సార్ నగర్ పోలీసులు. 16 ఏళ్ళ నుంచి రౌడీషీటర్ డేవిడ్ రాజు పోలీసులను నానా ఇబ్బందులు పెడుతున్నాడు.

అతన్ని కృష్ణ జిల్లా లో అరెస్టు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు హైదరాబాద్ కి తరలించారు. గతంలో ఎర్రగడ్డ లో ఒకటే రోజు జరిగిన ఏడు హత్య కేసులో డేవిడ్ రాజు ప్రధాన నిందితుడు అని పోలీసులు పేర్కొన్నారు. ఎస్సార్ నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లతో పాటు నగరంలోని వివిధ పోలీస్ స్టేషన్ లలో ఇతని పై 1991 నుంచి కేసులు నమోదు అయ్యాయి అని పోలీసులు పేర్కొన్నారు.