ఆ మాట ఎవరైనా అంటే రాజకీయాల నుండి తప్పుకుంటా – కడియం శ్రీహరి

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేసారు. మంగళవారం హన్మకొండ వేలేర్ మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..స్టేషన్ ఘనపూర్ నుండి మూడుసార్లు ఎమ్మెల్యే గా , ఓసారి ఎంపీగా గెలిచానని , అక్కడ ఏ రేంజ్ లో అభివృద్ధి చేసానో చెప్పాల్సిన పనిలేదు. ప్రజలు నన్ను నమ్మి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని , ఎక్కడ ఏ తప్పు చేయలేదని అన్నారు. ఎవరైనా ఆ తప్పు చేసావు..ఆ లంగా పనిచేసావ్ అంటే రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు. స్టేషన్ ఘన్పూర్ లో అనుకోని విదంగా ఏదైనా మార్పు జరిగి తనకి అవకాశం వస్తే మీరు నాకు సహకరించాలని ప్రజలను కోరారు.

మీ ఎమ్మెల్యే ఎవరు అంటే గల్లా ఎగరవేసుకొని మా ఎమ్మెల్యే కడియం అని చెప్పే విధంగా పని చేశానన్నారు. ఏ తప్ప చేయలేదు, అవినీతికి పాల్పడలేదు, తలవంపులు తీసుకురాలేదన్నారు. రాబోయే రోజుల్లో నిజాయితీగా పనిచేస్తా.. మీకు చెడ్డ పేరు తీసుకురానన్నారు. మీరందరూ గొప్పగా చెప్పుకునే విధంగా నా ప్రవర్తన ఉంటుందని.. చిల్లర పనులు నా దగ్గర ఉండవన్నారు. అందరం కలిసి ముచ్చటగా మూడోసారి బిఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తేవాలన్నారు.