మహిళా ప్రయాణికురాలిపై దాడి.. కండక్టర్ అరెస్ట్

టికెట్ విషయంలో జరిగిన వాగ్వాదంలో ఓ మహిళా ప్రయాణికురాలిపై కండక్టర్ దాడికి పాల్పడ్డాడు. బెంగళూరులోని బిలేకల్లి నుంచి శివాజీనగర్కు వెళ్తున్న BMTC బస్సులో ఈ ఘటన జరిగింది. వాగ్వాదంలో ముందుగా కండక్టర్ మహిళపై చెయ్యి ఎత్తాడు.

దీంతో ఆమె అతడి చెంపపై కొట్టింది. కండక్టర్ తీవ్ర ఆగ్రహంతో మహిళపై పదే పదే దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. కండక్టర్ను అధికారులు సస్పెండ్ చేశారు. దీనికి సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.