ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత

కస్టమ్స్ అధికారుల అదుపులో దుబాయ్ ప్రయాణీకుడు

కాన్పూర్ ఎయిర్‌పోర్టులో రూ.16 లక్షలు విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సైకిల్ పెడల్‌లో బంగారం దాచి అక్రమ రవాణా చేస్తున్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్న అధికారులు కేసు విచారణ జరుపుతున్నారు.