ఉచిత రేష‌న్ ప‌ధ‌కం పొడిగింపు..కేంద్రం

వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కూ పొడిగింపు

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్ర‌ధాన మంత్రి గ‌రీబ్ క‌ళ్యాణ్ అన్న యోజ‌న(జీకేఏవై) పేరిట అందించే ఉచిత రేష‌న్ ప‌ధ‌కాన్ని 2022 మార్చి వ‌ర‌కూ పొడిగించేందుకు కేంద్ర క్యాబినెట్ బుధ‌వారం ఆమోద ముద్ర వేసింది. ఈ ప‌ధ‌కం కింద 80 కోట్ల మందికి జాతీయ ఆహార‌భ‌ద్ర‌త చ‌ట్టం కింద ప్ర‌భుత్వం 5 కిలోల బియ్యం, గోధుమ‌ల‌ను ఉచితంగా అంద‌చేస్తుంది.

జీకేఏవై ప‌ధ‌కాన్ని వ‌చ్చే ఏడాది మార్చి వ‌ర‌కూ పొడిగించాల‌ని కేంద్ర క్యాబినెట్ భేటీ నిర్ణ‌యించింద‌ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. కొవిడ్‌-19 క‌ట్ట‌డికి లాక్‌డౌన్‌లు విధించ‌డంతో పేద‌లు జీవ‌నోపాధిని కోల్పోవ‌డంతో కేంద్ర ప్ర‌భుత్వం గ‌త ఏడాది పీఎం-జీకేఏవైని జాతీయ ఆహార భ‌ద్ర‌త చ‌ట్టం ల‌బ్ధిదారుల కోసం ప్ర‌క‌టించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/