కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం : అయిదుగురు కూలీలు మృతి

9 మందికి తీవ్రగాయాలు

Road Accident
Road Accident

Vijayawada: కూలీలతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటన నూజివీడు మండలంలోని గొల్లపల్లి సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందగా..మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని..క్షతగాత్రులను దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/