సురక్షితంగా

డోర్‌లాక్‌ సంగతులు

Revolar Lock
Revolar Lock

హోటల్‌ గదుల్లో ఒక్కరే ఉండాల్సి వచ్చినప్పుడు యాడ్‌లాక్‌ కూడా ఉంటే హాయిగా నిద్రపోవచ్చు. దీన్ని సెకన్లలో డోర్‌కు ఫిక్స్‌ చేసేసుకోవచ్చు.

తలుపుకీ గుమ్మానికి మధ్యయోకి బ్లేడులా ఉన్న ఈ పరికరాన్ని అమర్చి ఆ తర్వాత ఎప్పట్లానే డోర్‌ లాక్‌ చేసేయాలి. దాంతో అవతలి నుంచి వేరే కీతో ఎవరైనా డోర్‌ ఓపెన్‌ చేయడానికి ప్రయత్నించినా అది తెరచుకోదు.

మళ్లీ లోపల ఉన్న వాళ్లు ఆ యాడ్‌లాక్‌ తీస్తే తప్ప. వీటిలానే తలుపుకి అడుగున పెట్టుకునే అలారంలు కూడా ఉన్నాయి. అవి ఎవరైనా బయట నుంచి తలుపుతీయడానికి ప్రయత్నిస్తే పెద్ద శబ్దంతో మోగి చుట్టుపక్కల వాళ్లని అప్రమత్తం చేస్తాయి.

రివోలర్‌తో సురక్షితం

అండాకారంలో చిన్న కీచెయిన్‌లానే ఉండే ఈ రివోలర్‌ని ప్యాంటు జుబుకో లేదా షర్టుకో తగిలించుకోవచ్చు.

దీన్ని రెండుమూడుసార్లు గట్టిగా నొక్కితే ఎస్సెమ్మెస్‌లూ ఈమెయిల్స్‌ ద్వారా అనుసంధానమై ఉన్న నెంబర్లకు ప్రమాదంలో ఉన్న సమాచారాన్ని పంపించడంతోబాటు లొకేషన్‌నీ షేర్‌ చేస్తుంది.

మళ్లీ ఎమర్జన్సీ అలర్ట్‌ బటన్‌ని ఆఫ్‌ చేసేవరకూ వాళ్లు ఉన్న ప్రదేశాన్ని సంబంధిత ఆప్‌ మ్యాప్‌లో చూపిస్తూనే ఉంటుంది.

ఏడాదికోసారి బ్యాటరీ మార్చుకోగలిగే వీలున్న ఈ పరికరాన్ని ఎళ్లవేళలా దగ్గరే ఉంచుకుంటే నిశ్చితం గా బయటకు వెళ్లొచ్చు.

ఫోన్‌కి ఫోన్‌కి వెనుక అమర్చుకునే కటానా సేఫ్టీ ఆర్క్‌లూ, ఎస్‌ఓఎస్‌ మెసేజ్‌ను అందించే ఐఫోన్‌ వాచీలూ, బేటన్‌ టెలీస్కోప్‌క్‌ ఫోల్డబుల్‌ రాడ్‌లూ, లోపల చాకు ఉండే దువ్వె నలూ, గాయ పరిచే పెన్పులూ, షాక్‌ కొట్టే లెదర్‌ జాకెట్లూ డునిమ్‌ కోట్లూ బ్రాలూ ఇలా ఎన్నెనో రకాల గ్యాడెజట్లు మహి ళల ఆత్మ రక్షణకు అంతోఇంతో సాయపడుతున్నాయి.

తాజా జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/national/