కొత్తిమీర కారం తయారుచేసే విధానం

CORIANDER KARAM PODI

కొత్తిమీర కేవలం సాంబారులో, కూరల్లో రుచికి వేసుకోవడమే కాదు. దాంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వేడి అన్నంలోకి కొత్తిమీర కారం వేసుకుని కాస్త నెయ్యి చేర్చి తింటే ఆ రుచే వేరు. మరి కొత్తిమీర కారం ఎలా చేయాలో తెలుసుకుందామా.

కావలసిన పదార్థాలు

కొత్తిమీర తురుము – నాలుగు కప్పులు
పచ్చిసెనగపప్పు – 2 టేబుల్‌ స్పూన్లు
మినప్పప్పు – 4 టేబుల్‌ స్పూన్లు
ఎండుమిర్చి – పది
వెల్లుల్లిపాయలు – నాలుగు,
చింతపండు – కొద్దిగా
ఉప్పు -తగినంత
నూనె – 2 టేబుల్‌ స్పూన్లు

తయారుచేసే విధానం

కొత్తిమీరను శుభ్రంగా కడిగి సన్నగా కోసం ఆరనివ్వాలి. తరువాత బాణలిలో వేసి వేయించి తీయాలి. ఇప్పుడు పప్పులూ, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసి వేయించి తీయాలి. చల్లారాక వీటన్నింటికీ చింతపండు,
ఉప్పు చేర్చి మిక్సీలో వేసి మెత్తగా రుబ్బాలి.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/