నల్లపూసల అందాలు..

ఫ్యాషన్‌…ఫ్యాషన్‌

The beauty of black beads

చుడీదార్‌ వేసుకుంటే చెవులకు పెద్దపెద్ద జుంకీలూ చేతులకి గాజులూ ధరిస్తాం. ఇక, జీన్సూ స్కర్టుల్లాంటి మోడరన్ డ్రెస్సులు వేస్తే లుక్‌ పూర్తిగా ట్రెండీగా మారిపోతుంది మరి.

కుమారి, శ్రీమతి అయితే ఏముందీ, మెడలో వేసుకునే నల్లపూలల్ని చేతికి బ్రేస్‌లెట్‌లా, వేళ్లకు ఉంగరాల్లా తరలించేస్తాం.

అవును ఇది సరికొత్త ట్రెండ్‌. పెళ్లైన అమ్మాయిలు నల్లపూసలు వేసుకోవడం ఓ సంప్రదాయం. కానీ జీన్సూ టాప్‌లూ మోడ్రన్‌ డ్రెస్సుల మీదికి నల్లపూసల గొలుసులు వేసుకుంటే సెట్‌ కాదు.

అలా అని పద్ధతిని పక్కన పెట్టేయడం లేదు ఈతరం భామలు. మెడలో వేసుకునే నల్లపూసల్ని ఇలా బ్రేస్‌లెట్లలానూ ఉండరాల్లానూ మార్చి ఫ్యాషన్‌గా కూడా ఉంటాయి.

పైగా నల్లపూసల గొలుసుల్లో వచ్చినట్లే వీటిలోనూ బోలెడు వెరైటీలు వస్తున్నాయి బాగున్నాయి కదూ!

Hari tattoo

జుట్టుకీ టాటూ!

ఒండిమీద రకరకాల టాటూలు వేయించుకోవడం ఎప్పట్నుంచో ఉంది. జుట్టుకీ టాటూలు అంటించ డమే సరికొత్త ఫ్యాషన్‌. క్లిప్పులూ పూసలూ హెయిర్‌ బ్యాండ్లలాంటివి పెట్టాలంటే వాటికి తగ్గట్టు హెయిర్‌స్టైల్‌ ఉండాలి.

కానీ ఈ హెయిర్‌ టాటూల్ని ఏ స్టైల్లో వేసిన జుట్టుకైనా అందంగా అంటించేయొచ్చు. బంగారం, వెండి రంగులతో పాటు ఇతర వర్థాల్లోనూ మెరిసే ఇవి మామూలు టాటూ డిజైన్లలానే కాదు, క్లిప్పుల్లానూ తలకు పెట్టుకునే ఆభరణాల రూపంలో కూడా వస్తున్నా యి. కురులకు కొత్త అలంకారం బాగుంది కదూ..

lehenga design

లెహంగా చిత్రాలు

కుండన్‌, జర్దోజీ, కచ్‌ ఇలా రకరకాల ఎంబ్రాయిడరీలతో లెహంగాల మీద వర్కు చేయించడం తెలిసిందే. అయితే ఈ మధ్య ఆ అందాలకు తోడుగా వేడుకకు తగినట్లూ ఫొటోలనూ జత చేస్తున్నారు డిజైనర్లు.

నిజానికి జాకెట్ల వెనక భాగంలో ఫొటోలను ముద్రించి కుట్టుపూలు వేయించడం ఇప్పటికే ప్రాచుర్యం పొందింది.

lehenga design-
lehenga design
lehenga design

అది మరో అడుగు ముందుకేసి ఇప్పుడు లెహంగాల మీదికి చేరింది.

పెళ్లిళ్లూ, నిశ్చితార్థ వేడుకల కోసం ముందుగానే జంటలు ఫొటో షూట్‌లు తీయించుకుని ఈ చిత్రాలను బట్టమీద ప్రింట్‌ చేయించి లెహంగాల మీద అందంగా కుట్టించి ఎంబ్రాయిడరీ చేయిస్తున్నారు.

ఇదో కొత్త ఫ్యాషన్‌ అన్నమాట.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/